Monday, December 23, 2024

మన ఫోన్లే మనపై గూఢచార్లు!

- Advertisement -
- Advertisement -

‘భారత దేశంలో బడా వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒక దానితో ఒకటి ఎంత చక్కగా కుమ్మక్కై ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతీ రాయ్ వ్యాఖ్యానించారు. గత నెల స్వీడన్‌లోని స్టాక్‌హోవ్‌ులో ఆమె చేసిన ప్రసంగంలో మరి కొంత భాగం. ఇక్కడ చాట్ బాట్ యుగం జరుగుతోంది. దాన్ని కొందరు కృత్రిమ మేధస్సు అంటున్నారు. నిజానికది నాల్గవ పారిశ్రామిక విప్లవం. నైపుణ్యం గల కార్మికులు, చేనేత కార్మికులు, పరిశ్రమల్లో కార్మికులు, ప్రపంచ వ్యాపితంగా ఉన్న రైతులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు కూడా అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారా? (హస్తకళా రూపాలు, చేతి నైపుణ్యం గలవి, వస్త్రాలు, కళా ఖండాలు చాలా పరిమితంగా అమ్ముడవుతాయి. నవలలు చేతి రాతల కిందకు వస్తాయి). చాట్ జిపిటి వల్ల సాహిత్యం మరింత బాగా వస్తుందా? ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త నావ్‌ుచావ్‌ుస్కీ మాత్రం చాట్ జిపిటి వల్ల సాహిత్యం సరిగా రాదంటారు.

మనం ఆయనను సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే, ఒక యంత్రం ద్వారా నేర్చుకునేవి సంపూర్ణ శాస్త్ర విజ్ఞానం, సంపూర్ణ కళలు కాలేవు. అవి అంతులేని పరిమాణంలో, లెక్కలేనంత వేగంతో తయారవుతాయి. కానీ, అవి మానవప్రవృత్తికి, మానవ శక్తిసామర్థ్యాలకు ప్రత్యామ్నాయం కాజాలవు. అది సాహిత్యంలోకి వచ్చే సరికి చాట్‌బోట్ రచయితలకు ప్రత్యామ్నాయమవుతుందనేదే నా ఆందోళన. (బహుశా నేను దానికి కాస్త పాత దానిని, పనికి రాని దానిని. సాహిత్యాన్ని ‘ఉత్పత్తి’గా చూడకపోవడం కూడా కావచ్చు. బాధ వల్ల, ఒత్తిడి వల్ల, ఈ క్రమంలో నా పిచ్చితనం వల్లనే రాస్తున్నాను) నా ఆందోళన ఏమిటంటే, ఈ రోజుల్లో కావల్సినంత సమాచారం, వివరాలు మానవ రచయితలకు పంపించేసింది “మానవ రచయితలు” అని నేను వాడాను చిట్టడివిలో ఒక ఉచ్చు లాంటిది అది. తప్పులు లేకుండా, రాజకీయంగా కచ్చితంగా ఉంటానికి ప్రయత్నించాలి. దీని వల్ల ప్రమాదం ఏమిటంటే, రచయితలు తమ ప్రవృత్తిని మరిచిపోయి చాట్‌బోట్‌లా తయారవుతారు. అప్పటికీ ఆత్మల మార్పు ఉండవచ్చు.

చాట్‌బోట్‌లు నిజమైన ఆత్మల్లా కనిపిస్తాయి. నిజమైన ఆత్మల్లా చాట్‌బోట్‌లు నటిస్తాయి. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజన్సీ (యుఎస్‌ఎఐడి) సాయంతో పాటు, అమెజాన్, యాపిల్, గూగుల్, ఒరాకిల్ వంటి పెద్దపెద్ద సాంకేతిక సంస్థలు, ఈ అవతార రాజ్యాలు దాదాపు మన పైకి పూర్తిగా వచ్చేశాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం 2019 నాటికి స్మార్ట్ ఫోన్‌లకు డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్ (డిఐఐఎ) తెచ్చేసింది. దీనికి తోడు వందకు పైగా ప్రభుత్వ సేవలను అందించడానికి, ఇంటివద్దకే పాస్‌పోర్టులు, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులను డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్ ద్వారా తెచ్చింది. డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్ కాస్తా ఇప్పుడు రాజధానిగాను, రాజ్యాంగాతీత ఆర్థిక రాజధానిగాను అయ్యి కూర్చుంది.

పౌరులు తమ వ్యాపారాలను నమోదు చేసుకుని నిర్వహించడానికి వెంచర్ క్యాపిటల్ హబ్‌గా తయారైంది. రష్యా చొరబాటు మొదలైన తరువాత, ‘యుద్ధ సమయంలో పునర్నిర్మాణం’ కోసం అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజన్సీ (యుఎస్‌ఎఐడి) సాయంతో డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్ సమంతా పవర్ అన్న పేరుతో పాదర్శకత, నైపుణ్యానికి అధికారిక పనిముట్టులా తయారైంది. డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్ ధైర్యవంతులైన ఉక్రెయిన్ ప్రజలకు అన్ని రకాలుగా సేవలందించింది. యుద్ధం గురించి తెలుసుకోవడానికి ఇప్పుడది 24/7 ప్రభుత్వ వార్తా చానెల్‌గా మారింది. శరణార్థులు పరిహారాన్ని పొందడానికి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రష్యా సైన్యాల కదలికలు, వారితో చేతులు కలిపిన వారి గురించిన సమాచారం, ఫోటోలను దీని ద్వారా పంపించవచ్చు. సాధారణ ప్రజలు తమ మనుగడ కోసం, తమ మేధస్సును ఉపయోగించుకునే సరైన సమయం ఇది.
యుద్ధం మొదలవ్వగానే, ఉక్రెయిన్ పౌరులు డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్‌పైన ప్రైవేటు డేటా ఎడబ్ల్యుఎస్ స్నోబాల్ అనే అమెజాన్ మిలటరీ హార్డ్ డ్రైవ్‌లకు మార్చుకున్నారు.

భూసంబంధమైనవి కూడా క్లౌడ్‌తో సమానం. ఉక్రెయిన్ బయటకు పంపాలంటే క్లౌడ్‌కు అప్‌లోడ్ చేస్తారు. యుద్ధ విధ్వంసం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ దాన్ని ఏమాత్రం సహించకుండా పోరాడుతోంది. ప్రజలు ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ వల్ల చెప్పుకోదగ్గ అపురూపమైన ప్రయోజనాలున్నాయి. శాంతి సమయంలో కూడా ఈ ప్రయోజనాలు ఉంటాయా? ఎడ్వర్డ్ స్నోడెన్ నుంచి మనం గమనించింది ఏమిటంటే, మనుగడకు రెండు దారులుగా వీధులుంటాయి. మన ఫోన్‌లే మన గురించి చెప్పే శత్రువులు. అవి మనపైన గూఢచారుల్లా పని చేస్తాయి. ‘ప్రజాస్వామిక ప్రపంచాన్ని’ పరిరక్షించడం కోసం అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజన్సీ డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్ (డిఐఐఎ)ను కాని, దానికి సమానమైనది కాని ఇతర దేశాల కోసం తీసుకోవాలని చూస్తోంది. ఈక్విడార్, జాంబియా, డొమినికన్ రిపబ్లిక్ వంటి దేశాలు ఈ సాయం పొందడానికి వరుసలో నిలుచుని ఉన్నాయి. ఒక్కసారి యుద్ధం కోసం మళ్ళీ డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాప్‌ను తీసుకుంటే, శాంతి సమయంలో దాన్ని ఉపయోగించకుండా, దాని అవసరం లేకుండా చేయవచ్చా? ఒక సారి ఆయుధం ధరించిన పౌరుడు, నిరాయుధుడిగా మారతా డా? ప్రైవేటు చేతిలో కెళ్ళిన వివరాలు, ప్రైవేటు కాకుండా అవుతాయా?

భారత దేశం ఈ మాయలోపడిపోతోంది. మోడీ తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టాక, భారత అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ జియో ని ప్రారంభించింది. చవకబారు సెల్‌ఫోన్‌లకు కూడా తీగ లేకుండా సమాచారాన్ని అందించే వ్యవస్థ దీంతో వచ్చిపడింది. ఈ పోటీలో మార్కెట్‌లో తాను పైచేయి సాధించాక, చిన్న మొత్తంలో రుసుము విధించడం మొదలు పెట్టింది. తీగ లేకుండా ప్రపంచంలోనే ఎక్కువ సమాచారాన్ని అందించే అతిపెద్ద సంస్థగా భారత దేశంలో జియో అవతరించింది. ఈ విషయంలో జియో చైనాను, అమెరికాను కూడా అధికగమించేసింది. 2019 నాటికి 300 మిలియన్ల స్మార్ట్ ఫోన్ వాడకందారులు తయారయ్యారు. మనం తిరస్కరించలేని ఈ ప్రయోజనాలతో పాటు,

విద్వేషాలకు, సామాజికంగా రేడియో ధార్మికతకు, అంతులేని తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిపడే ఈ ప్రవాహానికి ఈ 300 మిలియన్ల ప్రజలు సిద్ధంగా ఉన్న ప్రేక్షకుల్లా తయారయ్యారు. భారత దేశం నిర్యాలంకారంగా తయారవడం గమనించవచ్చు. నరమేధానికి, ముస్లిం మహిళపై అత్యాచారం చేయడానికి ఇచ్చే పిలుపులు బాగా వ్యాపించాయి. హిందువులు ప్రతీకారం తీర్చుకోవడానికి ముస్లింలను ఊచకోత కోయాలని పిలుపివ్వడం, హిందువులను ముస్లింలు చంపుతున్నారంటూ తప్పుడు వీడియోలు ప్రసారం చేయడం, జర్మనీ నాజీ పాలనలో టైఫస్ వ్యాధిని యూదులు వ్యాపింపచేస్తున్నారన్న ప్రచారం లాగానే, కరోనా వ్యాప్తికి ముస్లిం పండ్ల వ్యాపారులు తాము అమ్మే పండ్ల పైన ఉమ్మేస్తున్నారని ప్రచారం చేయడం ద్వారా ముస్లింల పైన విద్వేషం పెంచుతున్నారు.
హిందూ అగ్రరాజ్య సామాజిక మాధ్యమాల చానెళ్ళే మీడియాలో ప్రధాన స్రవంతిగా తయారయ్యాయి. సంప్రదాయ సైన్యం చేసే పనులు క్రమంగా ఉండే ప్రైవేటు సైన్యం చేస్తోంది. భారత దేశంలో పెద్ద పెద్ద వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒకే సమయంలో ఒకదానితో ఒకటి ఎంత చక్కగా ముడిపడి ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ. మిలియన్లలో ఉన్న భారత పౌరులు డిజిటల్ రంగంలోకి దిగేశారు. విద్య, ఆరోగ్య పరిరక్షణ, వ్యాపారం, బ్యాంకింగ్ వ్యవహారాలు, పేదలకు ఆహార సరఫరా వంటి వాటన్నిటితో భారతీయుల జీవితాలన్నీ ఆన్‌లైన్ పైనే ఆధారపడిపోయాయి. సామాజిక మాధ్యమాల కార్పొరేషన్లు ప్రభుత్వ చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయాయి. ఊగిసలాడుతున్న మార్కెట్ల మనస్సును ప్రభుత్వం అదుపులోకి తెచ్చేసుకుంది. ఎప్పుడో ఒక సారైనా సరే ప్రభుత్వం సంతృప్తికరంగా లేకపోతే, ప్రతి దాన్ని మూసేస్తుంది

. ఈ ఏడాది (2023)లో రానున్న డిజిటల్ ఇండియా చట్టం ప్రభుత్వానికి ఊహాతీతమైన అధికారాలను కట్టబెట్టబోతోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత దేశంలో లెక్కలేనన్ని ఇంటర్‌నెట్ సెంటర్లను మూసేసింది. 2019లో ఏడు మిలియన్ల కశ్మీరి లోయ ప్రజలకు టెలికమ్యూనికేషన్ సేవలను నెలల తరబడి నిలిపివేసింది. ఫోన్ కాల్‌లు లేవు, రాత పూర్వక సమాచారాలు లేవు, సందేశాలు లేవు, ఒటిపిలు లేవు, ఇంటర్‌నెట్ లేదు. నేనిక్కడ మాట్లాడుతున్న ఈరోజుకు నాలుగు రోజుల ముందు నుంచి పరారీలో ఉన్న పంజాబ్ వ్యక్తిని పట్టుకోవడానికి ఇంటర్ నెట్‌ను నిలిపివేసింది.
భారత దేశంలో 2026 నాటికి ఒక బిలియన్ స్మార్ట్ ఫోన్ల వాడకం దారులు తయారవుతారు. భారత దేశం చెప్పిన డిఐఐఎ యాప్ డేటా ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు.ఆ సమాచారం అంతా ప్రైవేటు కార్పొరేషన్‌ల చేతిలో ఉండిపోయింది లేదా, ఆ సమాచారమంతా ఫాసిస్టు రాజ్యం చేతిలోను, దానికి ఉపదేశాలు చేసే వారి చేతిలోనో, సాయుధులైన మద్దతుదారుల చేతిలోనే ఉండిపోయింది. ఉదాహరణకు, నూతన పౌరసత్వ చట్టం వచ్చాక భారత దేశం తన పౌరుల నుంచి పది మిలియన్ల శరణార్థులను తయారు చేసుకుంది. వారిని బహిష్కరించ లేదు వాళ్ళ కోసం జైళ్ళను నిర్మించాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులేదు. దేశానికి శరాణార్థుల శిబిరాలు కాని, కార్మిక శిబిరాలు కానీ అవసరం లేదు.

దానికి అంతులేని సేవలందించే జనాభా లభించింది. హక్కులు, ఓటింగ్ హక్కులు, కనీస వేతనాలు, ఆర్యోగ్య పరిరక్షణ, ఆహార రేషన్ ఇవ్వనవసరం లేకుండానే వెట్టి చేసే కార్మికులు దొరికారు. వారెక్కడా పుస్తకాల్లో కనిపించరు. దేశ పదవ గణాంక చిహ్నాలను అది బాగా పెంచేస్తుంది. ఇది చాలా ప్రతిభావంతంగా, పారదర్శకంగా జరిగిపోతుంది. చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశంగా కనిపిస్తుంది. చాలా ఒపిగ్గా ఇంత సేపు విన్నందుకు కృతజ్ఞతలు. ఇది ఎలాంటి రాజ్యంలా కనిపిస్తోంది? లేదా దాని స్వభావం ఎలా ఉంది? ఏదో గుర్తించలేనట్టు ఉంటుందా? లేదా ఏదైనా గుర్తించేటట్టు ఉంటుం దా? ఈ ఆలోచనలతో మిమ్మల్ని వదిలేయనివ్వండి. రాజ్యం అంటే ఏమిటి? మనుషులంటే ఎవరు? రచయితలంటే ఎవరు వారు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News