Monday, December 23, 2024

గొర్రెల పంపిణీతో గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: స్వరాష్ట్రంలో కులవృత్తులకు సిఎం కెసిఆర్ పూర్వవైభవం తీసుకు వచ్చారని, గొల్ల, కురుమలను ఆర్థికంగా సామజికంగా బలోపేతం చేసేందుకు రాయితీపై గొర్రెల యూనిట్‌లను అందజేసి గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపారని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు ఆవరణలో రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా పట్టణానికి చెందిన 6మంది లబ్ధ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందన్నారు. గొల్లకురుమలను బలోపేతం చేసేందుకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం తీసుకు వచ్చారన్నారు.

గొర్రెల పెంపకంతో ఆర్థికంగా గొల్లకురుమలు లాభపడతారన్నారు. 15కుల వృత్తులకు లక్ష రుపాయల సహాయం చేస్తుందని, ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ బొంగుల విజయలక్ష్మి, సిడిసి చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, వైస్ చైర్మెన్ లత విజేందర్‌రెడ్డి, గొర్రె కాపరుల చైర్మన్ ప్రదీప్‌కుమార్‌చ కౌన్సిలర్‌లు మహేశ్వరీ, ఉమా, విష్ణు, మల్లేశం, డైరెక్టర్‌లు డాక్టర్ శ్రీహరి, వెంకటేశ్వర్లు,నర్సింలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News