Monday, December 23, 2024

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

- Advertisement -
- Advertisement -

అమరచింత : మున్సిపాలిటీ పరిధిలోని పంట పొలాలను బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి సుధా కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవ కాశాలు ఉన్నందున రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. తేలికపాటి వర్షాలలో 50 నుంచి 60 మి.మీ బరు వు, నెలలో 60 నుంచి 75 శాతం వర్షాపాతం నమోదైన తర్వా త 15 నుంచి 20 సెం.మీ లోతు తడిసిన తర్వాత రైతులు వర్షా ధార పంటలైన కంది, పత్తి, మొక్కజొన్న, పెసరపప్పు మొదలైన విత్తనాలు విత్తుకోవాలని సూచించారు.

కంది, పత్తి పంటలు జు లై 15వ తేది వరకు విత్తనాలు విత్తుకోవచ్చని తెలిపారు. పత్తితో మొక్కలు ఎర్రబడితే మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారి చేయాల ని సూచించారు. జులై 18 వరకు పాస్ బుక్కు వచ్చిన రైతులు రైతు బీమా పథకం 2023 సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవా లని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండల అధికా రి వినయ్ కుమార్, ఏఈఓ రాజేష్ విఆర్‌ఏలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News