Sunday, December 22, 2024

జిల్లా గణాంక దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లా గణాంక దర్శిని 2021-/22 పుస్తకాన్ని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సోమవారం సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… సామాజిక, ఆర్థిక ప్రణాళిక విధాన, రూపకల్పనలో ముఖ్యమైనదన్నారు. రోజువారి జీవితంలో గణాంకాల వాడకం విధానాలను రూపొందించుటలో గణాంకాలు దోహదపడతాయని తెలిపారు. జిల్లా గణాంక దర్శినిలో జనాభా, వాతవరణం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, రవాణా, నీటి వనరులు, పంటలు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, లోకల్ బాడీ ఇండస్ట్రీస్, సోషల్ సెక్యూరిటికి సంబందించిన అంశాలు వివరంగా ఉంటాయని తెలిపారు. గణాకం దర్శినిలో అన్ని శాఖల జిల్లా గణాంక వివరాలు పొందుపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ముఖ్య ప్రణాళిక అధికారి కె. కృష్ణయ్య, జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాకుమారి, డిఈఓ రాధాకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News