న్యూఢిల్లీ: పేదరికాన్ని నిర్మూలించేందుకు చట్టం పనిచేయాల్సి ఉంది. నేటికి ఉన్నవారికి, లేనివారికి మధ్య వ్యత్యాసం ఉందన్నది నిజమని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆదివారం ఇక్కడ తెలిపారు. “ మనది సంక్షేమ రాజ్యమే అయినప్పటికీ అట్టడుగున అందాల్సిన వారికి ప్రయోజనాలు ఇప్పటికీ అందడంలేదు. గౌరవంగా జీవించాలనుకునే ప్రజలు ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. అందులో ప్రధానంగా పేదరికాన్ని” అన్నారు.
పేదరికం ప్రభావం, సమాజంలో పేదలు, ధనిక వర్గం మధ్య అంతరంపై పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ అన్న “ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా అసలైన స్వాత్రంత్యం ఉండదు” మాటను ప్రస్థావించారు. “ ఆకలితో అలమటిస్తున్న వ్యక్తి స్వతంత్రుడిగా ఉన్నాడు అనడమంటే అతడిని హేళన చేయడమే” అని తెలిపారు. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంలోనే ఏర్పాటైన దేశవ్యాప్తంగా న్యాయ చైతన్యం ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. “పేదరికం అనేది దురదృష్టకరమని, ఆ విషయంలో చట్టం ఎలాంటి బాధ్యత తీసుకోదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అందాల్సిన వారికి అంది అందేలా జస్టిస్ డెలివరీ సిస్టం ఉండాలని ఆయన అభిభాషించారు. ‘తమ వనరులు అన్ని తరిగిపోక ముందే తమకు న్యాయం జరగాలని బాధితులు కోరుకుంటారు’ అని కూడా ఆయన తెలిపారు. ఒత్తిడిలో ఉన్న మహిళ, అండ అందాల్సి బాలలు, అక్రమంగా నిర్బంధంలో ఉన్న వ్యక్తి కోర్టును మొదట ఆశ్రయించే వ్యవస్థ ఉండాలన్నారు.
ఉన్నవారు, లేనివారికి మధ్య అంతరం ఇప్పటికీ ఉన్నదన్నది వాస్తవం: రమణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -