Monday, December 23, 2024

అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపనతో నిజం కాబోతున్న కోట్లాది హిందువుల కల

- Advertisement -
- Advertisement -

ఇవి స్వాగతించాల్సిన శుభ ఘడియలు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాములవారిని ప్రతిష్టించే గర్భగుడి వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేయగా, ఆ వీడియోను ఎంఎల్‌సి కవిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను పోస్టుకుకు జత చేశారు. అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభసమయం అని, తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమని అన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News