Monday, January 20, 2025

పేదల కలలు సిఎం కేసీఆర్‌తోనే సాకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగా / కాజీపేట: పేద ప్రజలు, గుడిసెవాసుల కలల సాకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాద్యమైందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. బుధవారం కాజీపేట పట్టణంలోని ఏఆర్‌ఆర్ కాలనీలో నిరుపేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసారు. ఈసందర్బంగా వినయ భాస్కర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు గూడు నీడ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నంబర్ 58 ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న పేదల 40 ఏళ్ళ కల సాకారమైందని, అవగాహన లేక చాలా మంది దరఖాస్తు చేసుకోవడం లేదని క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకు పర్యటిస్తున్నామన్నారు. చిన్న చిన్న లోపాలు ఉంటే అధికారులు సమన్వయంతో వారికి లబ్ధి పొందేలా చేయాలని సూచించారు. ఆర్డివో వాసు చంద్ర మాట్లాడుతూ లభ్ధి దారులకు సాంకేతిక సమస్యలు రాకుండా ప్రత్యేకంగా ఆర్‌ఐని నియమిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News