Monday, December 23, 2024

అటవీ ఉద్యోగుల విధులు కష్టతరమైనవి

- Advertisement -
- Advertisement -

కొత్తగా ఉద్యోగంలో చేరిన అధికారులు ప్రావీణ్యం సంపాదించాలి
10వ బ్యాచ్ అటవీ క్షేత్రాధికారుల శిక్షణా కార్యక్రమంలో అధికారుల సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్: అటవీ ఉద్యోగం, మిగతా ఉద్యోగాల మాదిరిగా కాకుండా, ప్రత్యేకమైనదని, పరిసరాలపై పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా, అటవీ అధికారుల విధి నిర్వహణ సవాలుగా మారిందని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి మెహన్ చంద్ర పర్గెయిన్ పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన అటవీ అధికారులు తమకు నచ్చిన విషయంలో ప్రావీణ్యతను సంపాదించడానికి కృషి చేయాలని, శిక్షణా సమయంలో వృత్తిపరమైన విషయాలపై దృష్టి పెట్టి, నైపుణ్యాలను సంపాదించుకోవడానికి పూర్తి సమయాన్ని కేటాయించాలని కోరారు.

రాష్ట్ర అటవీ అకాడమీ దూలపల్లిలో శుక్రవారం 10వ బ్యాచ్ అటవీ క్షేత్రాధికారుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన 30 మంది అధికారులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 18 నెలల పాటు కొనసాగుతుందని, ప్రకృతికి, ప్రజలకు, ప్రస్తుత రాబోయే తరాలకు కూడా సేవ చేసే అవకాశం అటవీ ఉద్యోగం కల్పిస్తుందని చెప్పారు. అదే విధంగా అకాడమీ డైరక్టర్, ఎస్. జె.ఆషా, అదనపు డైరెక్టర్, ఎస్. రమేశ్ కూడా ప్రసంగించి అటవీ క్షేత్రాదికారులకు పలు సూచనలు చేశారు. ఈసమావేశంలో అటవీ అకాడమీ సంయుక్త డైరెక్టర్,అటవీ క్షేత్రాధికారుల శిక్షణా కార్యక్రమం కోర్స్ డైరెక్టర్ ప్రవీణ, డిప్యూటీ డెరైక్టర్ లు సి హెచ్ గంగా రెడ్డి, వి. రామ మోహన్, కె.శ్రీనివాస్, ఎస్. ఎ.నాగినీ బాను, ఎన్.ఆర్.సంగీత, పి.వి.రామ కృష్ణ పాల్గొన్ని అటవీ అధికారులకు ఉండే సమస్యలను వివరించారు.

ఈకార్యక్రమంలో విశ్రాంత అటవీ అధికారులు ప్రదీప్, రవీందర్,అధ్యాపకులు అనిత్, రేంజ్ అధికారులు, వంశీ కృష్ణ, సుభాష్ చంద్ర యాదవ్, రామ్ మోహన్, బాబా ఖాదర్ వలీ, డిప్యూటీ రేంజ్ అధికారి ఉమా రాణి, సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్, ఫిజికల్ ట్రైనర్స్, అశోక్ రెడ్డి, కొండల్ రావు, అనిల్ శిక్షణ అటవీ బీట్ అధికారులు, శిక్షణ అటవీ సెక్షన్ అధికారులు, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News