న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ‘ఆర్థిక సర్వే 2023’ని ప్రవేశపెట్టారు. భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2023-24లో 6 నుంచి 6.8 శాతం ఉండగలదని ఈ సర్వే ప్రొజెక్ట్ చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కేంద్ర బడ్జెట్ 2023 సామాన్యుల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. ప్రపంచం కూడా భారత్ వైపే చూస్తోందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ఆ దిశలోనే ఉండగలదన్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. కాగా నేడు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల శాఖ రూపొందించింది. దానిని ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ మార్గనిర్దేశనలో రూపొందించారు. ఆర్థిక సర్వే అన్నది బడ్జెట్‌కు మార్గనిర్దేశనంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిని ప్రొజెక్ట్ చేసేదిగా ఉంటుంది.
పార్లమెంటులో ఆర్థిక సర్వే 2023ని ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్!
- Advertisement -
- Advertisement -
Economic Survey 2023: Chapters
- Advertisement -