Wednesday, January 22, 2025

విద్యాసంస్థల బంద్ విజయవంతం

- Advertisement -
- Advertisement -

మధిర : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బందులో భాగంగా మధిర పట్టణ మండల వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ, పాఠశాలల, కళాశాలల విద్యా సంస్థల బంద్‌ విజయవంతం చేయటం జరిగింది. ముందుగా మధిర పట్టణంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గర్ల్స్ హై స్కూల్ నుండి మధిర మెయిన్ రోడ్డు పై 300 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కార్పోరేట్, ప్రైవేట్ ఫీజులు దందా కోనసాగుతున్న ఇప్పటికీ ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రులు ఉపసంఘం, తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనూకులంగా వ్యవరిస్తున్నట్లుగా ఉందని అన్నారు.

విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫామ్ ఇవ్వలేదు, కోన్ని టైటిల్స్ పాఠ్యపుస్తకాలు పంపలేదు, చదువులు చెప్పే టీచర్లు లేరు, పారిశుద్ధ్య కార్మికులు లేరు ,అనేక సమస్యలతో విద్యాసంవత్సరం ప్రారంభమైన నిర్ధిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. త్రాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్, ముత్రశాలలు, సరైన మౌళిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యారంగం గోల్లుమంటుంది. మన ఊరు-మనబస్తీ-మనబడి నిధులు గుత్తేదారులు తూతూమంత్రంగా మాత్రమే పనులు జరిగాయి కానీ ఎక్కడ సరిగ్గా పాఠశాలలకు ఉపయోగ పడింది లేదని అన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారిందనన్నారు. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదు. లెక్చరర్స్ లేరు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుండి ఫీజు రీయంబర్స్ మెంట్స్ స్కాలర్ షిప్స్ 5,177 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేయడం లేదన్నారు. గురుకులాలు, కేజీబీవిలు, ఇంటర్ కళాశాలలుగా అఫ్ గ్రేడ్ చేసిన కేజీబీవిలు భవనాలు లేక అరకోక సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయనన్నారు. వాటికి నిధులు లేవు, లెక్చరర్స్, టీచర్స్ లేరు.

నాణ్యమైన భోజనం లేక పుడ్ ఫాయిజాన్స్ అవుతున్న ఘటనలు కో కొల్లలు గా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్,లెక్చరర్స్ ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడం లేదు, ఒక్క డిఎస్సీ ఇప్పటివరకు వేయలేదు. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బంద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. డిమాండ్ చేశారు. బందుకు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఖమ్మం జిల్లా నాయకులు యంగల ఉజ్వల్ చరణ్ అన్నవరపు అయ్యప్ప మండల నాయకులు మాతంగి అశోక్ అన్నవరపు రామకృష్ణ వల్లభిదాసు అఖిల్ చావ కౌశిక్ హేమంత్ సాయి మౌనిక వేదనా కీర్తి దివ్య రమ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News