Thursday, January 23, 2025

రోగుల ప్రాణాలను కాపాడడంలో వైద్యుల కృషి ఎనలేనిది

- Advertisement -
- Advertisement -
  • ఆమనగల్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాచారం వెంకటేశ్వర్లగౌడ్

ఆమనగల్లు: వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని, వైద్యులు రోగుల పట్ల మానవత్వం చూపించాలని ఆమనగల్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాచారం వెంకటేశ్వర్లగౌడ్ అన్నారు. రోగుల ప్రాణాలను కాపాడడంలో వైద్యుల కృషి అజరామరం అని కోనియాడారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకోని, వైద్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు పరీక్షిత్, నాగరాజు, మంజులదేవి, విజయలక్ష్మీ, మెండెం చంద్రశేఖర్‌లను శాలువాలతో సత్కరించి, అభినందించారు.

వైద్య వృత్తిలో నిత్యం తీరిక లేకుండా ఉన్న వైద్యులు వారి వారి వృత్తిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోంటున్నారని, అధ్యక్షులు వెంకటేశ్వర్ల గౌడ్ అన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా రోగుల సంఖ్య పెరుగుతుందని వారికి చికిత్స చేసి, ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ముఖ్య పాత్ర వహిస్తారని పెర్కోన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు గోవర్థన్‌రెడ్డి, కోరివి వెంకటయ్య, యాదయ్య, జూలూరి రమేష్, శేఖర్‌రెడ్డి, పాపిశెట్టి రాము, రాంమ్మోహన్, ఎంగలి బాలకృష్ణ, రాంరెడ్డి, సుధీర్‌రెడ్డి, చంద్రశేఖర్, ఉప్పల రాము లు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News