Monday, December 23, 2024

మిషన్‌భగీరథ అధికారుల కృషి అభినందనీయం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: ప్రతి ఇంటికి శుద్ధ్దమైన తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట ప్రాంతంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్ర మానికి అదనపు కలెక్టర్ రాహుల్, మిషన్ భగీరథ ఈఈ అంజన్‌రావు, అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగేందుకు శుద్ధజలం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ అందించి తాగు నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు ముందు 54 ఆ వాసాలకు అందించిన నీటిని గత 9 సంవత్సరా పాలనలో ఎంతో అభివృద్ధ్ది చెంది 667 ఆవాసాలకు అందించడం జరుగుతుంద న్నారు.

9 ఉన్న ఓహెచ్‌డిఆర్‌లను 32కు పెంచుకోవడం జరిగిందన్నారు. 100 కిలోమీటర్ల మేర ఉన్న గ్రిడ్ పైపులైన్‌లను 1,525 కి.మీలు పెంచుకోవడం జరిగిందన్నారు. ఇంటింటికి నల్లా కనెక్షన్ అందించేందుకు 201 కిలోమీటర్లు ఉన్న పైపులైన్‌ల వ్యవస్థను 2 వేల 729 కి.మీలు వ్యాపించి ఉన్న పైపులైన్‌ల ద్వారా కనెక్షన్ అందించి తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నా రు.

418 ఉన్న ఓహెచ్‌ఆర్‌ను ప్రస్తుతం 981కు పెంచుకోవడం జరిగిందని, 8 వేల 600 ఇండ్లకు ఉన్న నల్లా కనెక్షన్‌లను ఇ ప్పుడు 1 లక్ష 80 వేల ఇండ్లకు నల్లా ద్వారా తాగు నీరు అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ కా ర్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి తాగు నీరు అందించడం జరుగుతుందన్నా.

మహిళల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా శుద్దమైన తాగు నీరు ఏ విధంగా సరఫరా అవుతుందో ప్రతి విష యాన్ని ప్రజలకు తెలియజేసేలా మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. ప్రతి ఇంటికి తాగు నీ రు అందించడంలో మిషన్‌భగీరథ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News