Wednesday, January 22, 2025

పోలీసుల కృషి అభినందనీయం

- Advertisement -
- Advertisement -

జోగిపేట: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సురక్షా దినోత్సవం నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఇందులో పోలీసులతో పాటు బిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెండ్లి పోలీసింగ్ విధానాన్ని రాష్ట్ర పోలీసు శాఖ సమర్దవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రక్తదాన శిబిరంలో వారికి ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News