Monday, January 20, 2025

ఐపిఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐపిఎస్ అధికారి అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడుదల కాకముందే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన అప్పటి డిజిపి అంజనీకుమార్ చర్యను ఇసి తీవ్రంగా పరిగణించి సస్పెండ్ చేసింది. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ అంజనీకుమార్ ఇసికి విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు రోజున తాను ఉద్దేశపూర్వకంగా రేవంత్‌ను కలిసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని, రేవంత్ పిలిస్తేనే తాను వెళ్లినట్టు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో మరోమారు ఇలాంటివి జరగవని హామీ ఇచ్చారు. అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సిఇసి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News