జగిత్యాల: నోడల్ అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం ఐడీఓసీలోని తన చాంబర్‌లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలవిధుల నిర్వహణలో భాగంగా నోడల్ అధికారులు ప్రాథమిక సమాచారం తెలిసి ఉండాలన్నారు.
జిల్లాలో మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్, టైనింగ్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, రవాణా, కంప్యూటరీకరణ, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతిభద్రతలు సెక్యూరిటీ, ఈవీఎం మేనేజ్‌మెంట్, ఎంసీసీ, ఖర్చుల మానిటరింగ్, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్టోరోల్, ఫిర్యాదులు, ఓటరు హెల్ప్‌లైన్, పరిశీలకులుగా నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బీఎస్ లత, వివిధ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.