Thursday, December 26, 2024

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు బాధ్యతగా పని చేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఎన్ని కలు సజావుగా, పకడ్భందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. మంగళవారం ఐడిఓసిలోని ప్రజా వాణి హాల్లో ఎన్నికల నోడల్ అధికారులకు తమ బాధ్యతలు, కర్తవ్య నిర్వహణపై దిశానిర్దేశం చేశా రు. రానున్న ఎన్నికలకు నోడల్ అధికారులు ఇప్పటికే బాధ్యతలు అప్పగించడం జరిగిందని అందు కు సంబంధించిన ఎన్నికల నియమావళి, నిబం ధనలు సైతం ఇవ్వడం జరిగిందన్నారు.

నోడల్ అ ధికారులు ఎన్నికల నియమావళిని చదువుకుని ఆ కళింపు చేసుకుని బాధ్య తతో పనిచేయాల్సి ఉంటు ందన్నారు. ఒక్కో నోడల్ అధికారి వారిగా వారి బాధ్యతలపై అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వీప్ యాక్టివిటీపై ప్ర త్యేకంగా దృష్టి పెట్టాలని నోడల్ అధికారిని ఆదేశించారు. 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి యువతను ఓటరు జా బితా లో పేరు నమోదు చేసుకునే విధంగా కళాశాల, గ్రా మ స్థాయిలో ప్రచారం చేయించాలని సూచించా రు.

ఇందుకు తహసీల్దార్ స్థాయి అధికారిని సహాయకంగా నియమించడం జరు గుతుందన్నారు. ఓటరు జాబితాలో అమ్మాయిల నమోదు శాతం జిల్లాలో చాలా తక్కువగా ఉందని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహకారంతో 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతిఒక్కరికి ఓటరు జాబితాలో పేరు నమో దు చేసుకునే విధంగా చూడాల న్నారు. కళాశాలల్లో ఎలెక్టోరల్ లిటరసీ క్లబ్ ద్వారా విద్యార్థుల కు అవగాహన కల్పించాలని తెలిపారు.

మోడల్ కోడ్ ఆఫ్‌కండక్ట్, మెటిరియల్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ మే నేజ్మెంట్,మీడియా మానిటరింగ్ తదితర అన్ని అ ంశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు.సమావేశంలో అదనపుకలెక్టర్ కుమార్ దీపక్, అదనపు క లెక్టర్ కె.సీతరామరావు,నోడల్ అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News