Monday, January 20, 2025

ఎలక్టోరల్ రోల్ పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ బృందం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:జిల్లాలో నిర్వహిస్తున్న ఎలక్టోరల్ రోల్‌ను ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎస్‌బీ జోషి, ఎస్‌హెచ్ ప్రపుల్ అవాస్తిలు పరిశీలించారు. గురువారం జిల్లాకు చేరుకున్న బృందం సభ్యులను కరీంనగర్ సర్కూట్ రెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బూత్‌లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లతో ఇంటింటి సర్వే మొదలగు వాటిపై సమీక్షించారు. పోలింగ్‌స్టేషన్ వారీగా నిర్వహించిన ఇంటింటి సర్వే రికార్డులను కమీషన్ సభ్యులు పరిశీలించారు. ఓటర్ల తొలగింపు, ఒకే ఇంటి నెంబర్‌పై ఉన్న ఓటర్ల సంఖ్యను తదితర విషయాలను గురించి బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, హరిసింగ్, ఈఆర్‌ఓలు, ఎఈఆర్‌ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News