Wednesday, January 22, 2025

ఉప్పల్ స్టేడియమంతా పసుపుమయం…ధోని వైపే అభిమానులంతా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2024లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ – చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానున్నది. సన్ రైజర్స్ కు ఉప్పల్ స్వంత గడ్డ. కానీ ఉప్పల్ స్టేడియంలో ఎటుచూసినా పసుపుమయం కనబడుతోంది. చైన్నై టీమ్ ది పసుపు జెర్సీ. చెన్నై టీమ్ లో ధోని ఉన్నందున క్రికెట్ అభిమానులంతా చెన్నై టీమ్ నే సపోర్టు చేస్తున్నారు. అదే ధోని క్రేజ్ అంటే.

ఇటీవల విశాఖ పట్నంలో చెన్నై- ఢిల్లీ మ్యాచ్ జరిగినా అక్కడ కూడా ధోనీ అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు. నిజానికి చెన్నై సూపర్ ఓడిపోయినప్పటికీ చెన్నై టీమే అభిమానుల మనస్సు గెలుచుకుంది. నేడు హైదరాబాద్ జట్టు అభిమానులు కూడా చైన్నైకే మద్దతు తెలుపుతున్నారు.ధోనీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడ అభిమానులు పొలో మని వచ్చారు. చూద్దాం మ్యాచ్ ఎలా ఉండబోతుందో!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News