Monday, January 20, 2025

జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు హర్షణీయం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో, భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి చొరవతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, బిఆర్‌ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్థన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నూతనంగా జిల్లా ఏర్పడిన తర్వాత భూపాలపల్లి ప్రాంతంలోని ప్రజలు భూముల రిజిస్ట్రేషన్ల కోసం దాదాపు 30 నుండి 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుందని తెలుపగా, జయశంకర్ భూపాలపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఏర్పాటుచేస్తే ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఈ ప్రాంత ప్రజల రిజిస్ట్రేషన్ల ఇబ్బందులు తొలగిపోతాయని భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుచేయాలని ఎంఎల్‌ఏ సిఎం కెసిఆర్‌ను కోరారన్నారు. దీనిలో సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల దగ్గరకు వారికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా తీసుకొని వస్తున్న భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటు వారి నాయకత్వం బలపరచాలని నియోకవర్గం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News