Thursday, January 23, 2025

రోగుల ప్రాణాల పరిరక్షణకు వైద్యులు అందిస్తున్న విశిష్ట సేవలు ప్రశంసనీయం

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: రోగుల ఆరోగ్యాలను కాపాడటంలోను, వారికి మెరుగైన చికిత్సల ద్వారా ఎందరో ప్రాణాలను వైద్యులు రక్షిస్తున్నారని రాష్ట్ర శాసనమండలి సభ్యుడు బొగ్గారపు దయానంద్ కొనియాడారు. వైద్యులు తమ వృత్తి ద్వారా సమాజంలో ఆరోగ్యభద్రత విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. బుధవారం రాత్రి ఖైరతాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవా ల్లో భాగంగా వాసవి సేవా కేంద్రం ఫౌండేషన్ వ్యవస్ధాపకులు దివంగత డాక్టర్ పి. కిషన్ 91వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా సమాజంలో రోగులకు చికిత్సల ద్వారా అమూల్యమైన సేవలందిస్తున్న పలువురు వైద్యులు, నర్సులను సన్మానించి గౌరవించారు. అనంతరం బొగ్గారపు దయానం ద్ మాట్లాడుతూ సమాజంలో రోగుల ప్రాణాల పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం దిశగా వైద్యులు విశిష్ఠ సేవలందిస్తున్నారని, ఆలాంటి వారిని గుర్తించి సత్కరించడం వారిలో వృత్తిపరంగా బాధ్యతలు మరింత పెంచుతాయన్నారు.

వాసవి ఆస్పత్రి సమాజిక స్పృహా, సేవ భావంతో రోగులకు సేవలందిస్తోందని ప్రశంసించారు. దివంగతులు కొత్తూరు సీతయ్యగుప్తా, డాక్టర్ కిషన్ ఆశయాలతో ఆస్పత్రిని అత్యంత ఆధునిక వసతులతో సమర్ధవంగా రోగులకు సేవలందిస్తూ ఉత్తమ ఆస్పత్రిగా, అగ్రశ్రేణిలో ఉందన్నారు. ప్రియాగోల్డ్ రిఫైండ్ అయిల్ డైరెక్టర్ బుక్కా చంద్రశేఖర్, రమేశ్ ఆస్పత్రికి ఉచితంగా అత్యవసర అంబులెన్స్‌ను సమకూర్చారు. వీర్‌కేమిక్ ఆరోమెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పొద్దుటూరి రన్వీర్, వాసవి ఆస్పత్రి ఛైర్మన్ జి.చంద్రయ్య, ప్రాజెక్టు మేనేజర్ పంపటి జ్ఞాన్‌చందర్, గంజిరాజమౌళిగుప్తా, జయప్రకాశ్ రాం, వాసవి ఆస్పత్రి ప్రధాన కార్యదర్శి కొండ్ల మల్లీకార్జున్, కోశాదికారి రఘనందన్‌లు పాల్గొన్నారు. తొలుత బొగ్గారపు దయానంద్ డాక్టర్ పి.కిషన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News