కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రిటైర్డ్ ఉద్యోగుల అనుభవం చాలా ఉపయోగమని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని 42వ డివిజన్‌లో నగర మేయర్ పర్యటించారు. ఇందిరానగర్‌లోని పెన్షనర్స్ భవనాన్ని స్థానిక కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్‌రావుతో కలిసి సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెన్షనర్స్ భవనంలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం చిన్న గ్రంథాలయాన్ని ప్రారంభం చేసి సమావేశంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ముఖ్య అతిథిగా వచ్చిన నగర మేయర్, కార్పొరేటర్‌లను శాలువాతో సత్కరించి మోమెంటో అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేదో ప్రత్యేక రాష్ట్రం వచ్చాకా ఎలా అభివృద్ధి చెందిదో రిటైర్డ్ ఉద్యోగులకు తెలుసన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ నుండి పెన్షనర్స్ భవన్‌లో వసతులు కల్పించేందుకు గతంలోనే 10 లక్షల నిధులు కేటాయించామన్నారు.
పెన్షనర్స్ భవనంలో వసతుల కోసం అదనంగా మరో 10 లక్షల నిధులు కేటాయిస్తామని వాటితో అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మోసం అంజయ్య, రాష్ట్ర సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర మహేందర్‌రెడ్డి, జిల్లా కోశాధికారి బూరుగుపల్లి నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం శంకర్‌రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.