Saturday, December 21, 2024

గత 9 ఏళ్లలో బాన్సువాడ పట్టణ రూపురేఖలు మారాయి

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ రమేష్ కుమార్ పట్టణ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ గత 9 ఏండ్లలో జరిగిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన వివరిస్తున్నారన్నారు. వైద్యం, విద్యతో పాటు అన్ని రంగాల అభివృద్ధ్ది, సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ పనిచేస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ..
22 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పండుగ కొనసాగుతుందన్నారు. ఒక్కొక్క అంశంపై ఒక్కొక్క రోజు ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు వివరించారు. 1998లో అప్పట్లో బాన్సువాడ తీరుకు ప్రస్తుత తీరుకు ఎంతో మార్పు చెందిందని, వైద్యంతో పాటు విద్యకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారన్నారు. పేద విద్యార్థులకు గురుకు ల, మైనార్టీ, రెసిడెన్షియల్, తదితర సంక్షేమ హాస్టళ్లు, వసతులు, భవనల నిర్మాణంతో పాటు నర్సింగ్ కళాశాల తదితర అంశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధ్దికి ఎంతో కృషిచేస్తున్నారన్నారు. మాతా, శిశు ఆస్పత్రి నిర్మాణంతో పాటు గ్రామ గ్రా మాన డ్రైనేజీలు, రహదారులు నిర్మిస్తున్నామన్నారు. పట్టణంలోని ఎల్లయ్య చెరువును సుందరీకరణ కోసం కృషి చేస్తున్నామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య త లెత్తకుండా 14 ఎకరాలతో ఆటోనగర్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, గుడు లు, ఈద్గాలు, స్మశాన వాటికలు, దర్గాలు, తదితర వాటికి అవసరమైన నిధులను కేటాయిస్తున్నామన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఏనియోజకవర్గంలో లేని విధంగా 11 వేల డబుల్ బెడ్ రూంలను మంజూరు చేశామన్నారు. రాబోయే రోజుల్లో 3 లక్షల పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను నిర్మించి ఇవ్వడమే లక్షమన్నారు.

ఆస్పత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా వైద్యం..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆస్పత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తున్నామని, గర్బవతిగా ఉన్న పేదింటి ఆడ బిడ్డకు పౌష్టికాహారం అందించడానికి అంగన్‌వాడీ కేంద్రాలలో ఆహారం పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మందికి కెసిఆర్ కిట్ ఇచ్చారని, బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 వేల మందికి కెసిఆర్ కిట్ ఇచ్చామన్నారు. దేశంలోనే ఏ సిఎం అయినా ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. బిడ్డ పుట్టగానే తల్లి ముర్రుపాలు తాగించాలన్నారు. తల్లి పాల ప్రోత్సాహంలో బాన్సువాడ మాత, శిశు ఆస్పత్రికి జాతీయ అవార్డు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13.60 లక్షల మంది ఆడ బిడ్డలకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా నగదు అందిస్తున్నారన్నారు. 1994లో మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం ఒక్కటే జూనియర్ కాలేజీ ఉండేదన్నారు. ఇప్పుడు అన్ని విద్యాలయాలు కలిపి 30 ఉన్నాయన్నారు. 16 వేల మంది పిల్లలు చదువుకుంటున్నారన్నారు.

ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు. పట్టణం పరిశుభ్రంగా ఉంచడానికి గల్లీ గల్లీల్లో సిసి రోడ్లు వేయించామని, సైడ్ డ్రైనేజీలు కట్టించామన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నామన్నారు. కల్కి చెరువు దగ్గర రూ. 4 కోట్లతో చిల్డ్రన్, ఉమెన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మించామన్నారు. స్వంత ఇల్లు స్థలం లేని పేదవారికి స్థలం ఇచ్చి త్వరలోనే వచ్చే పేద వారికి స్థలం ఇచ్చి, త్వరలోనే వచ్చే రూ. 3 లక్షల ఇంటి పథకంలో మంజూరు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 9 ఏండ్లలో బాన్సువాడ పట్టణ రూపు రేఖలు మారాయి. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దయతో బాన్సువాడ పట్టణానికి కావాల్సిన నిధులు వస్తున్నాయన్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను సన్మానించి, వారితో కలిసి భోజనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News