జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం విద్య వై ద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, సర్కార్ బడులను బలో పేతం చేస్తూ ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు .. మన బడి పథకం కింద రూ. 54.87లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకు ముందు గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే రేషన్ షాప్ , అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డి జిటల్ బోర్డులు, బాలికలకు టాయిలెట్స్ , అత్యధిక మౌలిక స దుపాయాలతో పోలేపల్లి పాఠశాల కార్పొరేట్ దీటుగా మారింద న్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులను తక్కువ చేస్తూ మూడు గంటల కరెంటు సరిపోతుందని వ్యాఖ్యానించడంపై ఎ మ్మెల్యే లకా్ష్మరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాం లో మూడు గంటలే ఇచ్చారని, మళ్లీ తాము అధికారంలోకి వస్తే మూడు గంటలు ఇస్తామని చెప్పకనే చెబుతున్నారని రైతులు ఆలోచించాలన్నారు.
రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా పోలేపల్లి వి ద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్ర మాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కొడ్గల్ యాదయ్య, సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చం దర్, పిఏసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్‌గౌడ్, డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, కాటేమోన్ శంకర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జీనురాల సత్యం, పిట్టల మురళి, జంగయ్య, రఘుపతిరెడ్డి, పరమటయ్య తదితరులు పాల్గొన్నారు.