Thursday, December 19, 2024

ఫ్యాన్ గిలగిలా కొట్టుకోవడం ఖాయం

- Advertisement -
- Advertisement -

కావలి సభలో చంద్రబాబు వాడీవేడి ప్రసంగం

కావలి: టిడిపి అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసిపి నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.  నెల్లూరు లోక్ సభ స్థానం టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి  కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు.

ఈ సభలో చంద్రబాబు నేడు టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్… టిడిపిని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం అన్నారు.

అన్ని ధరలు పెంచేశాడు, చెత్త మీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్ను వేశాడు. ప్రజల ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డీఎస్సీ జరుగుతుందా? జాబ్ రావాలంటే బాబు రావాలి. ఈ ఐదేళ్లలో అందరూ నష్టపోయారు. ఆ విషయాన్ని చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీ అభివృద్ధి, మీ సంక్షేమం నా బాధ్యత అని చెప్పడానికి వచ్చానన్నారు.
ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్ ను ఇంటికి పంపడానికి సిద్ధమైపోయారు. ఈ ప్రజావ్యతిరేక తుపాను మాదిరిగా వస్తోంది. ఈ తుపాను తాకిడికి ఫ్యాను గిలగిలా కొట్టుకుంటుంది. చివరికి ఫ్యాను డస్ట్ బిన్ లో చేరుకుంటుందన్నారు.

ఇక బాబాయ్ ని చంపారు. బాబాయ్ ది గొడ్డలివేటా, లేక సహజమరణమా? చంపిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి మళ్లీ ఊరేగుతున్నారు. ఈయన చెల్లెలు ఇప్పుడు ఎలుగెత్తుతోంది. మా నాన్నను చంపిన వాళ్లపై కేసులు పెట్టండి, ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయండి, మా నాన్న ఆత్మకు శాంతి కలిగించండి అని అడిగితే, ఆడబిడ్డపై కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత మీకు రక్షణ ఉందా? అని ప్రజలను అడుగుతున్నా. ప్రజల ఆస్తులకు రక్షణ ఉందా? కృష్ణపట్నం పోర్టు ఏమైందో చూశాం.

ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో లేకుండా చేస్తే మనందరం బాగుపడతాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కొత్త వేషం వేసుకుని వచ్చాడు. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేవాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతున్నాడు. ఆ బస్సు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. అందులోంచి దిగకుండానే ‘మేము సిద్ధం’ అంటున్నాడు.

ప్రజలందరి ఆదాయాలు తగ్గిపోతున్నాయి, జగన్ ఆదాయాలు మాత్రమే పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో తలసరి అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది, ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. జగన్ మాత్రం విలాసవంతమైన ఇళ్లు కట్టుకోవడంలో నెంబర్ వన్ గా ఉన్నాడు. అందుకే ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నా… ప్రజలారా సిద్ధం కండిజగన్… నిన్ను, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం” అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News