Monday, December 23, 2024

పెళ్లి రద్దు చేసిందని కూతురుని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా పింపి మహిపాల్ గ్రామానికి చెందిన శుభాంగీ(22) అనే యువతి ఒక యువకుడిని ప్రేమించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. పెళ్లి రద్దు చేయాలని భావించిన శుభాంగి పెళ్లి కొడుకుకి ఫోన్ చేసి తన ప్రేమ విషయం చెప్పడంతో వివాహం రద్దైంది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి, సోదరుడు, బాబాయి ఈనెల 22న ఆమెను పొలానికి తీసుకెళ్లి తాడు గొంతుకు బిగించి చంపేశారు. అనంతరం మృతదేహానికి నిప్పుపెట్టి అవశేషాలను కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News