కైవ్, ఇతర ప్రదేశాలలో పౌర లక్ష్యాలపై క్రూరమైన దాడులు… జనరల్ సెర్గీ సురోవికిన్ నియామకంతో ముడిపడి ఉన్నాయి.
మాస్కో: రష్యా ఉక్రెయిన్‌లోని పౌర ప్రాంతాలలో క్షిపణుల వర్షం కురిపించడంతో పాటు పాశ్చాత్య అధికారులు కైవ్‌లోని ప్రభుత్వానికి సైనిక సహాయాన్ని కొనసాగించే మార్గాలను చర్చించడానికి ‘నాటో’ ప్రధాన కార్యాలయంలో సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇటీవలి యుద్ధంలో నాటకీయంగా దాడులు పెరగడం వెనుక రష్యన్ దళాల కొత్త కమాండర్ నియామకం, యుద్ధం మధ్య సంభావ్య సంబంధంపై ఊహాగానాలు ఉన్నాయి.
క్రెమ్లిన్ శనివారం (అక్టోబర్ 8) జనరల్ సెర్గీ సురోవికిన్ ను నియమించినట్లు ప్రకటించింది. సిరియాలోని రష్యన్ దళాల నాయకుడిగా సహా అనేక తీవ్రమైన, సంక్లిష్టమైన యుద్ధాలలో 55 ఏళ్ల అనుభవజ్ఞుడు, క్రూరత్వానికి పేరుగాంచిన వ్యక్తి. అతడో అరివీర భయంకరుడు. యుద్ధరంగం రికార్డుల ప్రకారం సురోవికిన్‌కు “భీకరుడు”, “జనరల్ ఆర్మగెడాన్” వంటి టైటిళ్లు ఉన్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఒక నివేదికలో పేర్కొంది.
“సురోవికిన్ మార్షల్ జుకోవ్ లాంటివాడు” అని మాస్కోకు చెందిన ‘థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఎనాలిసిస్ ఆఫ్ స్ట్రాటజీస్ అండ్ టెక్నాలజీస్’ డైరెక్టర్ రుస్లాన్ పుఖోవ్ పేర్కొన్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ నివేదిక పేర్కొంది. “అతను ఒక కఠినమైన వ్యక్తి, అతడికి యుద్ధం ఎలా నిర్వహించాలో తెలుసు. అతను వాస్తవానికి ఓ మృగం వంటివాడు, వోడ్కా తాగే మామూలు వ్యక్తి కాదు. అతడు నిజమైన పోరాట యోధుడు, అతడు ఉన్నతాధికారులకు నిజం చెప్పడానికి కూడా భయపడడు ”అని పుఖోవ్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’తో అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రెడ్ ఆర్మీ కీలక విజయాలలో కొన్నింటికి నాయకత్వం వహించిన మార్షల్ జార్జి జుకోవ్ వంటి వాడు ఈ జనరల్ సెర్గీ సురోవికిన్.