Monday, January 20, 2025

బిసి బిల్లు కోసం పోరాటం ఉధృతం

- Advertisement -
- Advertisement -

బిసి డిమాండ్లపై మోడీ ప్రభుత్వ వైఖరిపై బిసి సంఘాల ఆగ్రహం

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లు ప్రవేశ పెట్టేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. జాతీయ స్థాయిలో బిసి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇప్పుడు బిసి బిల్లు రాకపోతే ఎప్పుడు రాదని, 30 సంవత్సరాల పోరాటం – వృదా అవుతుందని ఆయనన్నారు. బిసి బిల్లుకై పోరాడదామని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి బిసిలకు ఇస్తామని ప్రకటించిన బిజెపి నేతలు గత పదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండి బిసిల డిమాండ్ల పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని కృష్ణయ్య ప్రశ్నించారు.

రాష్ట్రంలో బిసి వాదం బలంగా ఉందని గ్రహించే బిసి సిఎం ప్రకటించారని, పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశ పట్టాలని చాలా కాలంగా పోరాటం చేస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్న్రించారు. బిసి బిల్లు తేవడం ద్వారా ఎస్‌సి, ఎస్‌టిల వలే బిసిలకు కూడా 50 శాతం ఎంపి, ఎంఎల్‌ఎ పదవులు బిసిలకు దక్కుతాయని, దీని ద్వారా బిసిలకు రాజ్యాధికారం సాధించడం సులభతరం అవుతుందని ఆయన చెప్పారు. మోడీ ప్రభుత్వం బిసిలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బిసి బిల్లు ప్రవేశ పెట్టి బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

మహిళా బిల్లు ఆమోదింపచేసుకున్న బిజెపి ప్రభుత్వానికి బిసి బిల్లు తేవడం కష్టమేమి కాదని ఆయనన్నారు. మహిళా బిల్లులో బిసి సబ్ కోటా కల్పించాలని, కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బిసిల అభివృద్ధి పట్ల సానుకూలంగా స్పందించి ఏటా రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి జాతీయ స్థాయిలో స్కాలర్ షిప్ పథకం, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు, స్టడీ సర్కిల్స్, బిసిలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల బిసి బందు పథకం ప్రవేశపెట్టాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. బిసి ముఖ్యమంత్రులు బిహార్, తమిళనాడు లో రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. కాని ఫీజు రీయింబర్స్ మెంట్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు పెట్టడం లేదని, బిసిల విద్య, ఉద్యోగ, ఆరోగ్య, రాజకీయ అభివృద్ధి ఎజెండాతో ముందుకు పోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News