Friday, November 22, 2024

ఫార్మాసిటీ రద్దుచేసే వరకు పోరాటం ఆగదు

- Advertisement -
- Advertisement -
  • టిపిసిసి సభ్యుడు మర్రి నిరంజన్‌రెడ్డి

యాచారం: భవిష్యత్ తరాలకు,పర్యావరణానికి ప్రమాదంగా మారనున్న ఫార్మాసిటీ రద్దుచేసే వరకు తమ పోరాటం ఆగదని టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.ఆదివారం యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద,తాటిపర్తి,నానక్‌నగర్,నక్కర్త మేడిపల్లి గ్రామాలలో టిజెఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా యాత్రలో జాతీయ కిసాన్‌సెల్ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ వలన గొలుసుకట్టు చెరువులు,కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఫార్మాసిటీ కంపెనీలు విసర్జించే విషపూరితమైనటువంటి వ్యర్ధ రసాయనాల వల్ల ఏర్పడే కాలుష్యంతో ప్రకృతి వనరులైన గాలి,నీరు,నేల విషపూరితమై భవిష్యత్ తరాల వారికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అన్నారు.ఫార్మాసిటీతో చుట్టుప్రక్కల ఎటూ 50 కిలోమీటర్ల మేర గొసుకట్టు చెరువులు,కుంటలు కాలుష్యంతో నిండిపోయే ప్రమాదం పొంచిఉందని పర్యావరణం దెబ్బతిని జీవజాతుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారబోతుందని ఆయన వివరించారు.

పాలకులు అవినీతి దురాశతో పచ్చని పంటపొలాలను నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.ఎదేమైనా ఈ ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు అన్ని రకాల ప్రయత్నాటు చేస్తున్నామని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఫార్మాసిటీ రద్దుచేసి ప్రజలను,పచ్చని పంటపొలాలను పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కుర్మిద్ద,తాటిపర్తి నానక్‌నగర్ సర్పంచ్‌లు బందె రాజశేఖర్‌రెడ్డి,దూస రమేశ్,దంతుక పెద్దయ్య,టిజెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,ఫార్మావ్యతిరేఖ పోరాట సమితి నాయకులు దార సత్యం,కవుల సరస్వతి, గణేష్, శ్రీకాంత్, వెంకటేష్, కమలాకర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి,తిరుమల్‌రెడ్డి స్థానిక ప్రజలు,రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News