కంటోన్మెంట్ : తొలగించిన ఓట్లను పునరుద్దరించే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే క్రీశాంక్ అన్నారు. బస్తీనిద్రలో భాగంగా కంటోన్మెంట్ ఎనిమిదవవార్డు పరిధిలోని ఆదర్శనగర్‌లో బస్తీనిద్ర కార్యక్రమం బస్తీవాసులతో కలిసి నిర్వహించారు.ఈసందర్బంగా బస్తీవాసులు ఎదుర్కోంటున్నసమస్యలను ఆయన ఆడిగి తెలుసుకున్నారు. అలాగే అనైతికంగా రక్షణశాఖ స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజల ఓట్లను తొలగించటంపై బస్తీవాసులతో కలిసి చర్చించారు. ఓట్లను పునరుద్దరించాలని గతంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కెటిఅర్ సైతం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి లేఖను రాయటం జరిగిందని ప్రజలకు సైతం తమలేఖల ద్వారా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు లేఖను వ్రాయాలని అన్నారు.అనంతరం వారు స్థానికంగా నిత్యం ఎదుర్కోంటున్న సమస్యల ఆయన అడిగి తెలుసుకున్నారు.అనంతం బస్తీవాసులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేసి వారితో పాటు కలిసి నిద్రించారు.ఈకార్యక్రమంలో రాజేష్, వేణు, సతీష్,రాహుల్,మోని, రంజిత్, రఘు, సాయి,రాజు తదితరులు పాల్గొన్నారు.
తొలగించిన ఓట్లను పునరిద్దంచేవరకు పోరాటం ఆగదు.
- Advertisement -
- Advertisement -
- Advertisement -