Wednesday, January 22, 2025

దవఖానాల్లో 3,124 పోస్టుల భర్తీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆసుపత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంటిఎస్ పద్ధతిలో నియ మించనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. 968 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, 2029 పోస్టులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో, 127 పోస్టులను ఎంటిఎస్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మొదలుకొని సెక్యూరిటీ గార్డు వరకు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News