- Advertisement -
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుంది. నిత్యావసరం అయిన వంటనూనెల ధరలు, నెయ్యి ధరలు కిలోకు రూ 208, రూ 213 చొప్పున పెరిగాయి. దీనితో బుధవారం మార్కెట్‌లో ఇప్పుడు వంటనూనెల ధరలు కిలోకు అత్యధిక స్థాయిలో రూ 555, నెయ్యి ధరలు కిలోకు రూ 605కు చేరుకున్నాయని స్థానిక దినపత్రిక దిడాన్ తెలిపింది. బుధవారం నుంచే ధరలు అమలులోకి వచ్చాయి. ఉన్నట్లుండి వంటనూనెలు, నెయ్యి ధరలు ఎందుకు ఇంతగా పెరిగాయనేది చెప్పడానికి సంబంధిత వ్యవహారాల మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. .ఇప్పటికైతే దేశంలో మూడువారాల పాటు వంటనూనెల అవసరాలు తీర్చే స్థాయిలో 1,60,000 టన్నుల పామాయిల్ నిల్వలతో కూడిన నౌకలు కరాచీ జంటరేవులలో ఉన్నాయి.
- Advertisement -