Monday, December 23, 2024

తొలి చర్చ…రచ్చరచ్చ

- Advertisement -
- Advertisement -

సై అంటే సై

గవర్నర్ ప్రసంగంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. చరిత్రను తవ్విపోసుకున్న పార్టీలు

బిఆర్‌ఎస్ గొప్పలు గప్పాలే

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు వాడివేడిగా జరిగాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు, వ్య క్తిగత విమర్శలతో మాటల యుద్దం జరిగింది. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ పార్టీ సభ్యులు కేటిరామారావు, హరీష్‌రావులు అధికార పక్షంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తడంతో అదే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షంపై విరుచుకు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన పరిపాలన,అ పాలనలో అన్ని గోప్పలే తప్ప ప్రజాసమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ తూర్పారబట్టారు. అబద్దాల పునాదులపై బిఆర్‌ఎస్ ప్రభు త్వ పాలన సాగిందని, గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళలో గత పాలకులు ప్రజాస్వామ్యయుతంగా కాకుండా నియంత ల మాదిరిగా పాలించారని ద్వజమెత్తారు. వ్యసాయ రంగం, విద్యుత్, విద్య, నిరుద్యోగం, ఇసుకు మాఫియా ఆగడాలు, డ్రగ్స్ మహామ్మారిని అరికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన బిఆర్‌ఎస్ పాలకులు ఇప్పటికి చెప్పిన అబద్దాలనే మళ్ళీ ఈ సభలో కూడా ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా శాసనభలోనే కాకుండా మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఘాటైన పదజాలంతో ఎండగట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి, అన్నారం బ్యారేజి లీక్ కావడానికి గల కారణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, సిఎం రేవంత్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా డ్రగ్స్‌కు రాష్ట్రం అడ్డాగా మారిందని, ప్ర జాజీవితం డ్రగ్స్‌తో సర్వనాశనమయ్యే ప్రమాదం నెలకొందని, అందుకే డ్రగ్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని మండలిలో సిఎం రేవంత్ ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వం చేసిన తప్పులు ,వైఫల్యాలను సిఎం తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఇలా ఉభయ సభల్లో తన ప్రసంగం యావత్తు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన పోరపాట్లు, లోపాలు, వైఫల్యాలు, కుంభకోణా లు, అక్రమాలు జరిగాయని వాటన్నింటికి బిఆర్‌ఎస్ పా ర్టీ ప్రభుత్వంలోని మంత్రులు, గత ముఖ్యమంత్రిగా బా ధ్యతని సిఎం రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
10 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య
గత పదేళ్లలో తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సీఆర్టీ నివేదికలో వెల్లడైంది. ఇదేనా రైతు ప్రభుత్వం! రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. రైతు బతికి ఉన్నప్పుడు పట్టించుకోని భారాస ప్రభుత్వం.. రైతు చనిపోయిన తర్వాత రూ.5 లక్షలు ఇచ్చింది‘ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. వరి వేస్తే.. ఉరే అని చెప్పిన కెసిఆర్ తన ఫామ్‌హౌజ్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్ తన వడ్లను క్వింటాకు రూ.4250 కి అమ్ముకున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా? తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అనేది పచ్చి అబద్ధం. కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగింది? 2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు చేరింది. తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందు కు వినియోగించుకోలేకపోయాం? ప్రత్యేక తెలంగాణలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగిం ది. ప్రాణహిత- చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. వాళ్లు ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారు. దళితులను లాకప్లలో పెట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి హింసించారని ఆయన ఆరోపించారు.బిఆర్‌ఎస్ సభ్యులను ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించం. వారిని ఇక్కడే కూర్చోబెట్టి కఠోర నిజాలు వినిపిస్తాం. వారికి ఇదే శిక్ష’ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పరీక్షల నిర్వహణలో ఫెయిల్
‘పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించని వారు.. ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేక.. 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారు.. టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నవారు వారు సిగ్గుతో తలదించుకొని.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేనేజ్‌మెంట్ కోటా లో పదవి పొందాలనుకుంటే కేటిఆర్‌కు నిరాశ ఎదురైందని, పదవి దక్కలేదనే నిరాశతోనే కెటిఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ ఎద్దేవా చేశారు.సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ వచ్చిందని ఇదే సభలో కెసిఆర్ అంగీకరించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.
ఈటల, మహమూద్ అలీ, గద్దర్‌లను అవమానించారు
పగతి భవన్ గడీలను బద్దలుకొట్టి ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు రావడం బిఆర్‌ఎస్ నేతలు సహించలేకపోతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి ప్రగతి భవన్లోకి ప్రవేశం లేదని హోంగార్డు వెనక్కి పంపారు. ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళితే అనుమతి లేదని పోలీసులు పంపించారన్నారు. సీఎంను కలిసేందేకు ప్రజానౌక గద్దర్‌ను అదే విధంగా అవమానించారు. గంటల కొద్దీ ఆయన్ను ప్రగతిభవన్ గేటు వద్ద నిలబెట్టారు. ఈ ఘటనలన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు. బిఆర్‌ఎస్ పాలనలో సీఎంను కలవాలంటే మంత్రులకే అవకాశం లేదన్నారు. కాని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి.. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఎవరైనా తమ సమస్యలు చెబితే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అమర వీరులు కుటుంబాలను అవమానించారు
ప్రభుత్వ నిరంకుశ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్
కుమార్ నిరసన తెలిపినందుకు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపాం. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే కార్యాచరణ రూపొందిస్తున్నాం. అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్కు పిలిచి గౌరవించారా? ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా? పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు. తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు? కేసీఆర్.. తన కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమ పార్టీ అని పదేపదే చెప్పుకునే బిఆర్‌ఎస్ ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం ధర్నాచౌకు పునరుద్ధరించామన్న సీఎం కావాలనుకుంటే కేటీఆర్, భారాస నేతలు ధర్నాచౌక్‌లో ధర్నా చేసుకోవచ్చన్నారు.
డ్రగ్స్‌పై సిట్ వేయాలని పోరాటం చేశా
బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఆ సంఘటనపై తానే సిట్ వేయాలని పోరాటం చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన న్యాబ్ కాగితాలకే పరిమితమైందని, డ్రగ్స్ నివారణకు 319 మంది సిబ్బంది కావాలంటే ఇవ్వలేదని, న్యాబ్ రూ. 29 కోట్ల నిధులు కోరితే కూడా ఇవ్వలేదన్నారు. అధికార కాంగ్రేస్ ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టేందుకు పటిష్ఠ ప్రణాళికతో వెళ్తుంది. డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా ఉపేకించేది లేదు.. కఠినంగా శికిస్లాం రాష్ట్ర సరిహదులోకి, డమ్, గంజాయి.వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రం ప్రచంతో పోటీ పడే విధంగ ముందుకు తీసుకెళ్తాం, ప్రతి పక్షాల సహకరించాలన్నారు. మే పాలకులం కాదు సేవకులు నాలుగున్నర కోట్ల ప్రజలకే సేవ చేసేందుకు ఇక్కడకు వచ్చాం అని స్పష్టం చేశారు.గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానికి శాసనసభ ఆమోదం తెలిపిన అనంతరం సభను ఈ నెల 20 వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News