Wednesday, January 22, 2025

పిల్లల తొలి డోస్ 92% పూర్తి

- Advertisement -
- Advertisement -

12-14 ఏళ్ల పిల్లల్లో రెండో డోస్ కూడా
47% ముగిసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడి

మన రాష్ట్రంలో పిల్లల వ్యాక్సినేషన్‌కు విశేష స్పందన కనిపిస్తోంది. కొవిడ్ టీకాలపై ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలతో పెద్దలు టీకాలు వేసుకోవడంతో పాటు పిల్లలకు కూడా వేయిస్తున్నారు. 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పి ల్లలకు మొదటి డోసు 92 శాతం పూర్తి కాగా, 47 శాతం రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే 15 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలకు 92శాతం మొదటి డో సు పూర్తి కాగా, 78 శాతం రెండో డోసు పూ ర్తయ్యింది. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి ఉన్న నేపథ్యంలో పిల్ల లు ఇంటి వద్దనే టీకాలు తీసుకుంటున్నారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత మళ్లీ వి ద్యాసంస్థల్లో టీకాలు వేయనున్నారు.

ఐదు జిల్లాలు మినహా 100 శాతం

రాష్ట్రంలో ఐదు జిల్లాలు మినహా 18 ఏళ్లు పైబడిన వారందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మొదటి డోసు 106 శాతం పూర్తి కాగా, రెండో 102 శాతం పూర్తయ్యిం ది. మేడ్చల్, ములుగు, నిజామాబాద్, హైదరాబాద్,కొమురం భీం ఖమ్మం జిల్లాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాల్సి ఉంది. మేడ్చల్ జిల్లాలో 98 శాతం మంది రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కాగా, కొమురం భీం జిల్లాలో 76 శాతం రెండు డోసులు పూర్తయ్యింది. వ్యాక్సినేషన్‌లో వెనకబడిన జిల్లాల పై ప్రత్యేకంగా దృష్టి పెడుతూనే వీలైనంత త్వరగా అర్హులైన అందరికీ టీకాలు ఇచ్చేలా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News