Saturday, November 23, 2024

క్రొయేషియా జోడీకి తొలి డబుల్స్ టైటిల్

- Advertisement -
- Advertisement -

The first doubles title for the Croatian pair

 

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్, మేట్ పావిక్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఈ క్రొయేషియా ద్వయం 6-4, 7-6(5), 2-6, 7-5తో మార్సెల్ గ్రానోల్లర్స్(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై విజయం సాధించింది. దీంతో వింబుల్డన్ టైటిల్ గెలిచిన మొదటి క్రొయేషియా డబుల్స్ జోడీగా మెక్టిక్-పావిక్ జోడీ చరిత్ర సృష్టించింది. కాగా, మెక్టిక్-పావిక్ జంటకు ఈ సీజన్‌లో ఇది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం.

ఇదిలా ఉంటే, 2018 ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్‌ను వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందిన పావిక్‌కు.. మెక్టిక్‌తో కలిసి ఇదే తొలి టైటిల్. మరోవైపు మెక్టిక్‌కు మాత్రం ఇదే తొలి గ్రాండ్‌స్లామ్. ఈ క్రొయేషియా జోడీ టోక్యో ఒలింపిక్స్‌లోనూ జంటగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు, శనివారమే జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సువే(తైవాన్),-ఎలిస్ మెర్టన్స్(బెల్జియం) జోడీ 6-3, 5-7, 7-9తో వెరోనికా కుడెర్మెటోవా- ఎలెనా వెస్నినా(రష్యా) ద్వయంపై విజయం సాధించి వింబుల్డన్ 2021 మహిళల డబుల్స్ టైటిల్‌ని సొంతం చేసుకుంది.

సమీర్ బెనర్జీకి బాలుర టైటిల్

కాగా బాలుర సింగిల్స్ విభాగం ఫైనల్లో అమెరికాకు చెందిన భారతీయ సంతతికి చెందిన సమీర్ బెనర్జీ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో అమెరికాకే చెందిన విక్టర్ లిలోవ్‌పై7 5, 6 3 వరస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. వింబుల్డన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో 17 ఏళ్ల సమీర్ కేవలం మూడు సెట్లను మాత్రమే చేజార్చుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News