Monday, November 18, 2024

ఎపిలో ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం

- Advertisement -
- Advertisement -

The first Phase of Nominations ended in the AP

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడ్రోజుల పాటు నామినేషన్ల దాఖలు పర్వం సాగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు జరుగగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండగా.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాల తర్వాత ఉప సర్పంచ్‌ల ఎన్నిక జరుగనుంది. తొలిదశలో 168 మండలాల్లో 3,249 గ్రామ పంచాయతీలు, 32, 504 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరిగే 168 మండలాల్లో ప్రత్యేక నిఘా పెట్టనున్నారు అధికారులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News