Sunday, December 22, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని 18, 20, 29, 30వ వార్డుల్లో రిక్షాకాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇంద్రానగర్, గరీబ్ నగర్, కన్యలాల్ బాగ్ కాలనీల్లో పర్యటించారు. మిషన్ భగీరథ పైపు లీకేజీలు లేకుండా ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ మంచి నీటిని అందించాలన్నారు.

బావుల పై కప్పులు ఏర్పాటు చేసి, పాడు బడ్డ ఇండ్లు తొలగించాలన్నారు. వార్డులలో పాత స్థంబాలు తొలగించి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వార్డులలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మార్లు మరో ప్రదేశానికి షిఫ్టింగ్ చేయాలని, రోడ్ల మధ్యలో ఉన్న ఐరన్ పోల్స్ తీసివేసి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నారు. విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించి, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలన్నారు.

శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ కాలనీలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలలో రోడ్లు తదితర అభివృద్ధి పనులకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోండల సువర్ణ అశోక్, లంకల పుష్పలతారెడ్డి, అనంత్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, నవీన్ కుమార్, బొండల అశోక్, కాశయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News