Monday, December 23, 2024

గుజరాత్‌లో తొలి ఎక్స్‌ఇ వేరియంట్ కేసు

- Advertisement -
- Advertisement -

The first XE variant case in Gujarat

ముంబయినుంచి వడోదర వచ్చిన వ్యక్తిలో గుర్తింపు

అహ్మదాబాద్: దేశంలో కరోనామహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నసమయంలో కొత్త వేరియంట్ ‘ఎక్స్‌ఇ’ కలకలం సృష్ట్టిస్తోంది. ఇటీవల ముంబయిలోని ఓ మహిళకు ఎక్స్‌ఇ వేరింట్ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లో ఈ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు వెలుగులోకి వచ్చింది. గత నెల ముంబయినుంచి గుజరాత్‌లోని వడోదరకు వచ్చిన 67 ఏళ్ల వ్యకికి ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌కన్నా ఎన్నో రెట్లు వేగంగా వ్యాప్తి చెందే ‘ఎక్స్‌ఇ’ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు శనివారం చెప్పారు. గత మార్చి 12న ఆ వ్యక్తి వడోదరకు వచ్చినప్పుడు జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అయితే ఆ వ్యక్తి స్థానిక అధికారులకు తెలియజేయకుండా ముంబయి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.

ఆ వ్యక్తి శాంపిల్‌ను గాంధీనగర్‌లోని లేబరేటరీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని, ఆ వ్యక్తికి ఎక్స్‌ఇ వేరియంట్ సోకినట్లు గాంధీనగర్‌కు చెందిన లేబరేటరీ నిర్ధారించిందని, కోల్‌కతాలోని లేబరేటరీలో శుక్రవారం ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబయిలోఉన్న ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కూడా వారు తెలిపారు. అతనితో సన్నిహితంగా మెలగిన ముగ్గురు వ్యక్తుల శాంపిల్స్‌లో నెగెటివ్ గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది. తమ విభాగం ముంబయిలో ఉన్న ఆ వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించిందని, అతని ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉన్నట్లుఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.‘ ప్రస్తుతం అతనికి వేరే ఇతర లక్షణాలు లేవు. తగు చర్యలు తీసుకోవడం కోసం మేము ఈ విషయాన్ని మహారాష్ట్ర అధికారులకు తెలియజేశాం.ఈ పరిణామంపై నిరంతరం కన్నేసి ఉన్నాం’ అనిరాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోజ్ అగర్వాల్ విలేఖరులకు చెప్పారు. ఒమిక్రాన్‌లోని రెండు సబ్‌వెర్షన్లు బిఎ1,బిఎ2 కలిసి ఎక్స్ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి.తొలిసారి యుకెలో బైటపడిన ఈ వేరియంట్ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది.దీనివ్యాప్తి వేగం ఒమిక్రాన్‌కంటే పది రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ)తో పాటుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News