Monday, December 23, 2024

హరితహారంతో జిల్లాలో వన సంపద పెరిగింది

- Advertisement -
- Advertisement -
  • పాఠశాల విద్యార్ధులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని పెంచాలి
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

కొండపాక: హరితహారంతో జిల్లాలో వన సంపద పెరిగిందని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆటవీ శాఖ ఆధ్వర్యంలో మర్పడగలోని ఆక్సిజన్ పార్కులో హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం నర్సరీలో మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం ద్వారా మరో విడతలో మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభమైందన్నారు. జిల్లాలో తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా సిఎం కెసిఆర్ అదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు మార్గదర్శకత్వంలో జిల్లాలో 7 కోట్ల 28 లక్షల మొక్కలు నాటి సంరక్షించడం జరిగిందన్నారు. జిల్లాలో 6.4 శాతం నుంచి 14 శాతానికి గ్రీన్ కవర్ పెరిగిందన్నారు.

పచ్చదనం పెరగడంతో జిల్లా ప్రజలకు, పశు పక్షాదులకు మంచిగాలి, ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందన్నారు. చెట్లు ఎక్కువ ఉంటే చెట్ల ఆకుల నుంచి నీరు బాష్పి భవనం ద్వారా ఆకాశంలోకి వెళ్లి మేఘాలను ఆకర్షిస్తాయని తద్వారా వర్షాలు కురుస్తాయన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రతిఒక్కరూ ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని పెంచాలన్నారు. ఎప్పటికి నిలిచి ఉండే గొప్ప ఆస్తి వృక్షాలన్నారు. ఒక మొక్క పెరిగి వృక్షంగా పెద్దదవడానికి పది సంవత్సరాల టైం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనవాస్, మర్పడగ సర్పంచ్ రజిత, మర్పడగ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చిన్నకోడూరులో… దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవం సందర్భంగా సిపి శ్వేత చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామ శివారులో ఉన్న సిఎఆర్ హెడ్‌క్వార్టర్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరి బాధ్యతమన్నారు. భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటడం ఆలవాటుగా చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రతిఒక్కరూ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున మొక్కలను నాటడం , మొక్కలను బహుమతిగా అందజేయడం ఒక అనవాయితీగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు డిసిపిలు సుభాష్ చంద్రబోస్, రామచంద్రారావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, రామకృష్ణ, ధరణికుమార్, ఆర్‌ఎస్‌ఐలు రోహిత్, రంజత్ , సాయిచరణ్ ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట అర్బన్‌లో.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవంలో మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు సిద్దిపేట పట్టణ శివారులోని రంగనాయక సాగర్ వద్ద 4 ఎకరాల్లో తేజోవనంలో అన్ని రకాల మొక్కలను మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేట పట్టణం హరిత వనంగా మారిందన్నారు. ఎక్కడా కూడా మొక్కలు చనిపోకుండా ప్రతి రోజు నీరు ఉండేలా హరితహారం సిబ్బందితో పనులు చేపిస్తూ పట్టణాన్ని నలు వైపులా పచ్చదనంగా మార్చారన్నారు.

తెలంగాణకు తలమానికంగా హారితహారమన్నారు. సిఎం కెసిఆర్ ప్రోత్సహించడంతో 10 శాతం గ్రీన్ బడ్జెన్‌ను హరితహారం కోసం కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ప్రజలు కూడా తమ గృహాల వద్ద మొక్కలను ప్రతిరోజు నీరు పట్టాలని పచ్చదనం మరింత పెంపొందించాలన్నారు.ఎన్సాన్ పల్లి వైపున డివైడర్‌లో 10 వేలకు పైగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్లు నాయకం ల క్ష్మన్, వినోద్ గౌడ్ ,వడ్ల కొండ సాయి, బందారం శ్రీలత, ప్రజాప్రతినిధులు , నాయకులు వంగ తిరుమలరెడ్డి, బందారం రాజు, కాటం రఘురాం, అల్లం ఎల్లం, రవీందర్‌గౌడ్, నాగుల ప్రశాంత్, అధికారులు సామల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News