అంబర్ పేట: దళిత బంధు పథకం లబ్ధిదారుల నుండి అంబర్‌పేట ఎమ్మె ల్యే కాలేరు వెంకటేష్ డబ్బులు తీసుకున్నారని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు గరిగంటి రమేష్ ఆరోపించారని ఎమ్మెల్యే అనుచరులు, దళిత సంఘాల నాయకులు గురువారం నల్లకుంటలోని గరిగంటి ఇంటిపై పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు ఇంటి ముందు ధర్నాకు దిగారు. గరిగంటికి వ్యతిరేకంగా నినాదాలు చే స్తూ ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్ననట్లు చేసిన ఆరోపణలు గరిగంటి రమేష్ నిరూపించాలని డిమాండ్ చేస్తూ ఇంటిముందు బైఠాయించారు.
గరిగంటి రమేష్ బయటకు వస్తావా …లేకుంటే మేము ఇంట్లోకి రావాలంటూ.. ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న నల్లకుంట పోలీసులు హుటాహుటిన గరిగంటి ఇంటి వద్దకు చేరుకొని ఇంట్లోకి చొరబడడానికి యత్నిచ్చిన నా యకులను అడ్డుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట ఉన్న కారుపై దాడి చేయగా కారు బంపర్ పూర్తిగా దెబ్బతిన్నది. తన ఇంటిపై దా డి చేసిన దళిత నాయకులనుపై, కాలేరు అనుచరులపై, దాడి చేయించిన ఎ మ్మెల్యే కాలేరుపై కేసు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ కు, ఈస్ట్ జోన్ డీసీపీకి, కాచిగూడ ఏసిపికి, నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని నల్లకుంట పోలీసులు తెలిపారు.