Saturday, November 23, 2024

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: మండువేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్ కొత్తకుంట చెరువు వద్ద ఊరూర చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్,హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల, వివేకనందనగర్ డివి.న్ కార్పొరేటర్ రోజాదేవి, తహసిల్దార్ వంశీ మోహన్, ఉప కమిషనర్లు వెంకన్న, సుధాంష్, ఇరిగేషన్ అధికారులు ఈఈ నారాయణ, డిఈ నళిని, ఏఈ పావనిలతో కలిసి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్సకారులతో కలిసి చెరువు కట్టకు ఊరేగింపుగా వెళ్లి కట్ట మైసమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చెరువు కట్టపై మొక్కలు నాటి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతు ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన మిషన్ కాకతీయతో చెరవులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసిన ఒక్క చుక్క నీరు ఉండేది కాదన్నారు.

చెరువులను కాపాడాలనే సోయి కూడా గత పాలకులకు ఉండేది కదన్నారు. చెరువులపై ఆధారపడిన కులవృత్తులకు బతుకుదెరువు లేక విలవిలలాడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందు చూపుతో మిషన్ కాకతీయతో జీవం పోశారన్నారు. మండువేసవిలో కూడా చెరువులన్ని నిండుకుండల్లా కనిపిస్తున్నాయాంటే అది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. ఒకప్పుడు చేపల దిగుమతి చేసుకునే స్థాయి నుండి మన ప్రభుత్వం హయాంలో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రంలో మత్య సంపద పెరిగిందన్నారు.

చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణి ద్వారా గంగపుత్రుల జీవనోపాధి పెరిగిందన్నారు. అంతరించి పోతున్న కులవృత్తులను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న విజన్‌తో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. నాడు తెలంగాణ కోటి రతనాల వీణ అన్నడు దాశరథి నేడు నా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసిండు కేసిఆర్ అన్నారు. నాడు ఎటు చూసిన తడారిన నేలలు నేడు ఎటు చూసిన పరవళ్ళు తొక్కుతున్న గోదారి, నాడు ఎటుచూసిన నోళ్లు తెరచిన బీళ్లు నేడు తలలూపుతున ఆకుపచ్చని పైర్లు. ఇది తెలంగాణ జల విజయం అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవ్గంలో చెరువుల పునరుద్దరణ, పూడిక తీత పనులను పెద్ద ఎత్తున చేపట్టం జరిగిందన్నారు. స్వంత నిధులతో దత్తత తీసుకొని చెరువులను అభివృద్ది చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, జీహెచ్‌ఎంసి అధికారులతో పాటు మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News