Monday, January 20, 2025

ఘనంగా చాత్తాద శ్రీ వైష్ణవ ఆత్మగౌరవ భవనం శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

హాజరై పూజలు నిర్వహించిన మంత్రులు గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం వేలకోట్లతో బిసిల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలు వేగం పుంజుకున్నాయి. ఆదివారం ఉప్పల్ పీర్జాదిగూడలో చాత్తాద శ్రీవైష్ణవులకు కేటాయించిన ఎకరం భూమి కోటి నిధులతో నిర్మించే ఆత్మగౌరవ భవనానికి మంత్రులు గంగుల కమలాకర్ చామకూర మల్లారెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన చాత్తాద శ్రీ వైష్ణవులు, శంకుస్థాపన భూమి పూజ అనంతరం శిలా ఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు రాష్ట్ర బిసి కమిషన్ చైర్‌పర్సన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం, చాత్తాద శ్రీవైష్ణవ సంఘం నేతలు, సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News