Friday, December 20, 2024

నేటి నుంచి రాయదుర్గ్ మెట్రో స్టేషన్లో ఆర్‌ఓబి నాల్గవ ద్వారం ఓపెన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ నేటి నుంచి రాయదుర్గ్ మెట్రో స్టేషన్లో ఆర్‌ఓబి నాల్గవ ద్వారం కూడా తెరువనున్నట్లు వెల్లడించింది. దీనిని ఓపెన్ చేస్తే మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, మరీ ముఖ్యంగా రద్దీ వేళల్లో స్టేషన్‌లోకి వెళ్లడం మరింత సులభతరం అవుతుందని పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైల్లో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్ నుంచి ప్రతి రోజూ దాదాపు 60వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తుంటారు. ఈ నూతన ద్వారానికి మెట్ల మార్గంతో పాటుగా ఎస్కలేటర్ కూడా ప్రయాణికుల కదలికలకు సహాయపడతాయని మెట్రో అధికారులు తెలిపారు.

నిర్వహణ సామర్ధ్యం మరింత మెరుగు

రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నాల్గవ ద్వారాన్ని ప్రజలకు అంకితం చేయడంపై హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా స్టేషన్‌లోకి వెళ్లడంతో పాటుగా మరింత మెరుగైన హైదరాబాద్ మెట్రో రైల్ అనుభవాలను పొందుతారని ఆయన తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నాల్గవ ద్వారం తెరవడంతో ప్రయాణికుల కదలికలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా తమ నిర్వహణ సామర్ధ్యం మరింత మెరుగుపడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News