Thursday, January 9, 2025

ఉచిత కరెంట్ విధానం కాంగ్రెస్‌దే

- Advertisement -
- Advertisement -

వైరా : ఉచిత కరెంట్ విధానాన్ని ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని వైరా కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం వైరాలో బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు కరెంట్‌పై ప్రచారం చేస్తుందని నిరసన ర్యాలీని నిర్వహించి అనంతరం సీయం కెసిఆర్ దిష్టి బొమ్మను దహ‌నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు కేవలం పది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తూ రైతులను మోసం చేస్తూ, రేవంత్ రెడ్డి చేసిన వ్యాక్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రా రాజశేఖర్, బాణోత్ రాందాస్ నాయక్,విజయాభాయి, శీలం వెంకటనర్సిరెడ్డి,దాసరి దానియేలు, మిట్టపల్లి నాగి, పణితి సైదులు, గంగారావు, పొదిల హరినాథ్‌, గుడిపుడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News