Wednesday, January 22, 2025

హైదరాబాద్ ఇక ఇవి హబ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇవి వాహనాలకు కేంద్రంగా హైదరాబాద్ మారబోతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. రానున్న రోజుల్లో ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇం దులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొబి లిటీ వ్యాలీని ప్రకటించామన్నారు. ఈ వ్యాలీ లో ఇవి వెహికిల్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల త యారీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేయను న్నామ న్నారు. బుధవారం హైటెక్స్‌లో జరి గిన ‘ఇ…మోటార్ షో2023 ఫస్ట్ ఎడి షన్‌ను మంత్రి కెటిఆర్ ప్రారం భించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఇ ప్పటికే ఎన్నో కంపెనీలు ఇవి రంగంలో పెట్టుబ డులను పెడుతున్నా య న్నారు.హైదరాబాద్ ఇ..మోటార్ షోలో దేశీయ కంపెనీల ఎల క్ట్రిక్ వెహికిల్స్లో ఏర్పా టు చేయడం సం తో షంగాఉందన్నారు. ఇ ది మొదటి అడుగు మాత్రమేనని అన్నారు. భవిష్యత్ అంతా ఇవి రంగందేనని అన్నారు.

ఇవి బ్యాటరీ తయారీ కంపెనీ అమర్ రాజా సంస్థ ఇప్పటికే తమ వస్తువులను తయారుచేసే యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇవి రంగం అభివృద్ధిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కెటిఆర్ అన్నారు. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీకి పరివర్తనలో కీలక పాత్ర పోషించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రధానంగా సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు, 2 …-వీలర్, 3…వీలర్ బస్సుల్లో ఇవి తయారీ వంటి పర్యావరణ వ్యవస్థలోని వివిధ భాగాల తయారీని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందని కెటిఆర్ చెప్పారు. స్థిరత, స్వచ్ఛమైన శక్తిని అవలంభించడంలో రాష్ట్రం ఇప్పటికే అగ్రగామిగా ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రగతిశీల ఇవి విధానం ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకోనునున్నామన్నారు. ప్రధానంగా దేశంలోనే చలనశీలతలో అత్యంత విద్యుత్‌ీకరించబడిన రాష్ట్రం’గా మారాలనిలక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ షోలో ఎలెక్ట్రిక్ బైక్స్, కార్స్, కమర్షియల్ వాహనాలు, టైర్ కంపెనీస్, మోటార్ కంపెనీస్, ఇబి బ్యాటరీ, ఇవి స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయి.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ సుజై కరంపురి, మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఇ..-మోటార్ షో ప్రారంభ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఇ…రేస్‌కు ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ నగరాల్లో ఇప్పుడు హైదరాబాద్‌కు స్థానం దక్కిందన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐటి, ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్ అండ్ ఇండస్ట్రీస్, కామర్స్ విభాగం ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News