Tuesday, December 24, 2024

కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జీసీడీఓ

- Advertisement -
- Advertisement -

సంగెం: మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం జీసీడీఓ ఫ్లోరెన్సీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తరగతిలోని విద్యార్థులను చదివించడం జరిగింది. అలాగే విద్యార్థినులను మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని అన్ని రిజిష్టర్ల పరిశీలించారు.

ఉపాధ్యాయునీలు రాత్రి విధులు నిర్వహిస్తున్నారని కావున పిల్లలను ఇంటిని మర్చిపోయే విధంగా చూసుకోవాలని, మెనూ ప్రకారం ప్రభుత్వం ఇస్తున్న పౌష్టిక భోజనాన్ని విద్యార్థినులకు అందించాలన్నారు. 10వ తరగతి విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీలో స్పెషల్ ఆఫీసర్ నీలిమ, ఉపాధ్యాయునీల బృందం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News