Monday, December 23, 2024

ఊటీలో ‘ది ఘోస్ట్’

- Advertisement -
- Advertisement -

The ghost movie

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దరకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’ది ఘోస్ట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో హీరోలను మునుపెన్నడూ చూడని పాత్రల్లో చూపించడంలో పేరుపొందిన ప్రవీణ్ సత్తారు… నాగార్జునని విభిన్నమైన పాత్రలో చూపించి ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

చిత్ర యూనిట్ ఇటీవల దుబాయ్‌లో సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సోనాల్ చౌహాన్ కూడా షూటింగ్‌లో పాల్గొంది. ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. “ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి” అని ట్వీట్ చేస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఊటీ లొకేషన్ స్టిల్ ని అభిమానులతో పంచుకున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News