కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్‌తో కలసి పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కర్నూలులో ‘ది ఘోస్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. “ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి అందరికీ విజయాన్నిస్తుందని అంటారు. ఈ పండగ మాకు కూడా విజయాన్నిస్తుందని నమ్ముతున్నా. మీ అందరికీ నచ్చి ఈ సినిమాను మెచ్చుతారని అనుకుంటున్నాను.‘ది ఘోస్ట్’ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి యాక్షన్, డ్రామా అంటే ఇష్టం. ఆ రెండింటినీ కలిపి ఈ సినిమా తీశారు. శివ సమయంలో సౌండ్స్ గురించి మాట్లాడారు.
‘ది ఘోస్ట్’లో ఎఫెక్ట్, మ్యూజిక్ నెక్స్ లెవెల్లో వుంటాయి. నేను చాలా సినిమాల్లో గన్స్ వాడాను. కానీ ఈ సినిమా కోసం నాతో పాటు హీరోయిన్ సోనాల్‌కి కూడా పదిహేను రోజుల పాటు మిలటరీ ట్రైనింగ్ ఇప్పించారు ప్రవీణ్ సత్తార్. నేను యాక్షన్ సినిమా చేసి చాలా రోజులైయింది. చాలా కష్టపడి చేశాం. ప్రేక్షకులంతా ఈ సినిమా చూసి ఆదరిస్తారనే గొప్ప నమ్మకంతో ఉన్నాం”అని అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ.. “నాన్నని స్టైలిష్, యాక్షన్ సినిమాలో చూడటానికి నేను ఇష్టపడతాను. అలాంటి సినిమానే తీశారు ప్రవీణ్ సత్తారు”అని చెప్పారు. ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. “నాగార్జునని డైరెక్ట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అందరీ అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్’ వుంటుంది. నాగార్జునని ఎలా చూసి పెరిగానో అలాంటి ఇంటెన్స్ లుక్స్‌తో ఆయన్ని తెరపై చూపించాను” అని తెలిపారు. శరత్ మరార్ మాట్లాడుతూ “ఇంత చక్కటి స్లీక్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసిన క్రిడెట్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి దక్కుతుంది. నాగార్జున ఈ చిత్రానికి మొదటి నుండి గొప్ప సపోర్ట్ అందించారు” అని అన్నారు. ఈ వేడుకలో అఖిల్, సోనాల్ చౌహాన్, పుస్కుర్ రామ్మోహన్ రావు, మార్క్ కె.రాబిన్ తదితరులు పాల్గొన్నారు.
‘The Ghost’ pre release event in Kurnool