నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జం టగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాను ప్రము ఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సోమవారం ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సిని మా టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా టీజర్‌లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు ఎదురుచూస్తున్నా. ప్రతి ప్రేక్షకుడినీ కదిలించే మంచి కథను ఈ సి నిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నా”అని అన్నారు. వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
వైవిధ్యమైన ప్రేమకథతో “ది గర్ల్ ఫ్రెండ్”
- Advertisement -
- Advertisement -
- Advertisement -