Thursday, April 3, 2025

వార్డు కార్యాలయాల ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు : ప్రజల చెంతకే సేవలు అందేలా చేయడానికి వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజల వద్దకే పౌరసేవలో భాగంగా శుక్రవారం పటాన్‌చెరు డివిజన్‌లో వార్డు కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే వార్డు కార్యా లయా లన్నారు.

ఈ కార్యాలయంలో అన్ని శాఖల సేవలు అందుబాటులో ఉంటా యన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాన కార్యాలయాల చుట్టు తిరుగకుండా వార్డు కార్యాలయాలు ఉపయోగపడుతాయన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగునంగా పాలన సాగుతుందన్నారు. డిఆర్టిఎ పిడి శ్రీనివాస్ రావు, జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News