Monday, December 23, 2024

టిబి రహిత రాష్ట్రమే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్రాన్ని 2025 నాటికి టిబి రహిత రాష్ట్రంగా మార్చడమే లక్షంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర ఆర్థ్ధిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టిబి వ్యాధిగ్రస్తులకు టిహెచ్‌ఆర్ న్యూట్రిషన్ కిట్లను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 వేల టిబి పేషంట్లు ఉన్నారన్నారు. 2025 నాటికి టిబి వ్యాధి లేకుండా చేయడమే లక్షంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టిబి వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధికాదని వైద్యుల సూచనల మేరకు ప్రభుత్వం అందించే మందులను వాడితే ఆ వ్యాధి దూరమవుతుందన్నారు. ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే మందులు, రూ.500లతో పాటు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో టిహెచ్‌ఆర్ న్యూట్రిషన్ కిట్లను అందిస్తామన్నారు. వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనే లక్షంతో ఈ కిట్లను తయారు చేసి ఉచితంగా అందజేస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూట్రిషన్ కిట్లు అందజేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఇందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థ్ధలు, దాతలు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. టిబి వ్యాధి నిర్మూలన లక్ష సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆశావర్కర్లు గడపగడపకు వెళ్లి ఎవరికైనా లక్షణాలు కనబడితే టెస్టులు చేయాలన్నారు. చాల మంది టిబి వ్యాధిగ్రస్తులు ఆందోళన చెంది బరువు తగ్గి బలహీన పడుతున్నారని వీరికి ధైర్యంతో పాటు పౌష్టికాహారం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిదన్నారు. సిద్దిపేట జిల్లాలో 1000 మంది వ్యాధిగ్రస్తులకు ఈ న్యూట్రిషన్ కిట్లను అందిస్తామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే రాష్ట్ర సర్కార్ ధ్యేయమన్నారు. వైద్యరంగానికి పెద్ద పీట వేసి పేదలందరికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్యామిలీ వెల్పేర్ కమిషనర్ శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ డైరెక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News